లేటెస్ట్ సినిమా న్యూస్

Nayanthara and Anil: వామ్మో అనిల్ రావిపూడి.. ప్రమోషన్స్ తో పిచ్చెక్కిస్తున్నాడు కదా!

Nayanthara and Anil: మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు కోసం నయనతార , అనిల్ రావిపూడి ప్రమోషనల్ వీడియో వైరల్

Nayanthara and Anil: మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి వచ్చేస్తున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన స్టైల్ లో ప్రమోషన్స్ ఇరగదీస్తున్నాడు

Nayanthara and Anil: మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. సంక్రాంతి బరిలో నిలుస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్నవిషయం అయినా వెంటనే వైరల్ అయిపోతోంది. ఒక పక్క చిరంజీవి.. మరో పక్క వెంకటేష్ వీరితో పాటు నయనతార పండక్కి పెద్ద మల్టీస్టారర్ సినిమాని సైలెంట్ గా ప్లాన్ చేశారు సంక్రాతి డైరెక్టర్ అనిల్ రావిపూడి. సంక్రాతి బరిలో అనిల్ సినిమా ఉంటే స్టార్స్ తో పనిలేకుండానే బ్లాక్ బస్టర్ అనేది ఇప్పటికే రుజువైంది. అలాంటిది మెగా స్టార్.. విక్టరీ వెంకటేష్ వీరిద్దరితో సంక్రాంతి బరిలోకి సినిమా తీసుకువస్తున్నారంటే ఏ రేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయో తెలీనది కాదు.

Nayanthara and Anil: సంక్రాంతి సందడికి సిద్ధమైన మెగాస్టార్

ఈ జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. పక్కా ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారుచాలా కాలం తర్వాత చిరంజీవి పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంలో నటిస్తుండటంతో మెగా అభిమానులు ఈ మూవీ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన మూడు పాటలూ సంచలనం సృష్టించాయి.

అనిల్ రావిపూడి మార్క్ ప్రమోషన్స్

Nayanthara and Anil: ప్రమోషన్లను విభిన్నంగా ప్లాన్ చేయడంలో అనిల్ రావిపూడి స్టైలే వేరు. షూటింగ్ ప్రారంభం నుంచే క్రేజీ వీడియోలతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేశారు. అసలు సినిమాలో నటించిన తరువాత ఆ సినిమా గురించి కనీసం పట్టించుకోని . . ప్రమోషన్స్ అంటే నేను రాను అని కచ్చితంగా చెప్పేసే నయనతారతోనే మొదటి ప్రమోషన్ చేసి సంచలనం సృష్టించారు . షూటింగ్ స్టార్ట్ కాగానే నయన్ తో కలిసి అనిల్ రావిపూడి చేసిన ప్రమోషన్ వీడియో సంచలనంగా మారింది. సినిమాపై భారీ అంచనాలు తీసుకువచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ గా నయనతారతోనే మరో ప్రమోషనల్ వీడియోను చేసి సోషల్ మీడియాలో పంచుకున్నారు.

వీడియో హైలైట్స్:

  • సాధారణంగా సినిమాల ప్రమోషన్లకు దూరంగా ఉండే నయనతార, ఈ సినిమా కోసం మాత్రం స్వయంగా రంగంలోకి దిగడం విశేషం.
  • తాజా వీడియోలో నయన్ నేరుగా అనిల్ రావిపూడిని కలిసి “సినిమా మొదట్లో ఒక వీడియో చేశాం.. మరి ఇప్పుడు ప్రమోషన్స్ ఏం లేవా?” అని అడుగుతుంది.
  • నయనతార స్వయంగా అడగడంతో అనిల్ రావిపూడి షాక్‌కు గురై కిందపడిపోవడం, అసిస్టెంట్స్ ఆయన్ని పట్టుకోవడం వంటి సన్నివేశాలు నవ్వులు పూయిస్తున్నాయి.
  • తరువాత హలొ . . కెమెరా కాస్త రైట్ టర్నింగ్ ఇచ్చుకోండి అంటూ నయన్ అనడం.. కెమెరా టర్న్ కాగానే అనిల్ ఫ్రెమ్ లోకి రావడం.. మూవీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేయడం ఇలా వీడియో ఒక రేంజిలో వచ్చింది
  • చివరగా ఇద్దరూ కలిసి “సంక్రాంతికి రఫ్పాడించేద్దాం” అంటూ జనవరి 12 రిలీజ్ డేట్‌ను కన్ఫర్మ్ చేశారు.

సినిమా విశేషాలు ఒకచూపులో:

ఫీచర్ వివరాలు
సినిమా పేరు మన శంకర వరప్రసాద్ గారు
ప్రధాన తారాగణం మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార
దర్శకత్వం అనిల్ రావిపూడి
జానర్ ఫ్యామిలీ అండ్ కామెడీ డ్రామా
విడుదల తేదీ జనవరి 12 (సంక్రాంతి కానుకగా)

ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ సినిమాపై పాజిటివ్ వైబ్స్‌ను క్రియేట్ చేయగా, లేటెస్ట్ ప్రమోషనల్ వీడియోతో సినిమా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *